సనాతనము అంటే శాశ్వతమైనది ఎన్ని అవాంతరాలు వచ్చినా మారని ధర్మం అని సనాతనలు చెప్పే విషయం ఈ ధర్మాలను అనుసరించేది మానవుడా మనుషులతో కూడిన సమాజమా అన్నది మనం గమనించినట్లయితే పుర్రె కో బుద్ధి అని మన పెద్దలు చెప్తారు ఒకరికి నచ్చిన విషయం మరొకరికి నచ్చకపోతే దానిని మిగిలిన వారు అంగీకరించాలా? ప్రజాస్వామ్యాల్లో ఎక్కువమంది అంగీకరించినదే శాసనము అని చెబుతారు. మరి అంగీకరించని వారు తక్కువ మంది ఉన్న వారికి ధర్మం తెలియనట్లేనా ధర్మాన్ని ఆచరించడంలో వారు వెనకంజ వేస్తారా అని కూడా ఆలోచించినట్లయితే నిద్రాహారభయములు మానవులకు సహజముగా ఉన్నవి స్వపర భేదములు లేవు. కడుపు మాడితే అన్నం తినడం ఎవరైనమానుకుంటారా నిద్ర వస్తే వాడు నిద్ర కూడా సహజ ప్రక్రియను కాదన్న వ్యక్తి వ్యక్తిగా నిలబడగలడా సమాజం వ్యక్తులు లేకుండా ఏర్పడిందా ఆలోచించి సరియైన నిర్ణయం తీసుకొని దానిని ఆచరించమని చెప్పాలి సతీసహగమనం అనేది సమాజంలో పాతుకుపోయిన ధర్మం భర్తలో సగమైన భార్య మరణంలో కూడా భాగస్వామి కావాలి భర్త లేని సమయంలో భారతంలో చెప్పారు వ్యాస మహర్షి భర్త లేని స్త్రీని సమాజం ఎలా చూస్తుందో ఒక్క అర వాక్యంలో చక్కగా చెప్పారు పడిన ఆమిషము బంగి ఒక పక్షి నోటిలో నుంచి ఒక మాంసపు ముద్ద రోడ్డు మీద పడినప్పుడు దానికోసం ఎన్ని పక్షులు జీవరాసులు దాని చుట్టూ మూగుతాయో మనకు తెలుసు ఆ స్థితి అంటాడు. సమాజంలో పాతుకుపోయిన ఒక ఆచారాన్ని మార్చడం అంత తేలికైన పని కాదు అందరినీ ఒప్పించాలి శాస్త్రీయ దృక్పథం ఏమిటో వారికి అర్థమయ్యేలా చెప్పాలి కాలం తీరిపోయి చనిపోయిన వ్యక్తి సహజ మరణం దానిని ఎవరు ఆపలేరు కానీ సజీవ ప్రాణంతో ఉన్న స్త్రీని ఆ ప్రాణం లేని కట్టేతో కలిపి బూడిద చేసే సమయంలో ఆ ప్రాణి ఎంత గిలగిలలాడుతుందో ఏ ఒక్కరైనా గమనించారా ఆ బాధ తన కూతురుకు తన చెల్లికి తన అక్కకు వస్తే వారు తట్టుకోగలరా ఇలాంటి విషయాలను అన్నిటినీ సంఘసంస్కర్తలు అనబడే పెద్దలు సమాజంలో ఆ నియమలను ఏర్పరిచిన వారితో కూడా మాట్లాడి మూఢమతుల మత్తులను కూడా మార్చి ఆ చెడ్డ సంప్రదాయాన్ని వేళ్ళతో సహా పెకలించి వేశారు.
ఏది సనాతనం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి