పేద.... ధనిక - బర్ల నవదీప్ -ఆరవ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేలీ ఘనపూర్- మెదక్-9908809824
 అనగనగా చంద్రపురం పాఠశాలలో రాము అనే అతను ఆరవ తరగతిలో చక్కగా చదువుతున్నాడు. అతనికి  చదువులో పోటీగా భీమ్ ఉండేవాడు. భీమ్ ధనవంతుల కుటుంబంలో జన్మించాడు.  రామ్ పేదరికంలో జన్మించాడు. పేదవాడివి పేదవాడివి అంటూ రామ్ ను తోటి విద్యార్థులు చులకనగా చూసేవారు.
               ఒకరోజు పాఠశాలలో మంచినీళ్లు సరైన సమయానికి నల్లాల ద్వారా రావడం లేదు. పాఠశాలలో నీళ్లు లేవు. ఆరోజు భీమ్ నీళ్ల డబ్బా తెచ్చుకోలేదు. మధ్యాహ్న సమయంలో భీమ్ గబగబా అన్నం తింటుంటే,  గట్టిగా వెక్కిళ్లు పడ్డది. భీమ్ కళ్ళలో నీళ్లు కారుతున్నాయి. ఎవరి దగ్గర నీళ్లు లేవు. రామ్ దబ్బున వెళ్లి తన వద్దనున్న నీళ్లు తాగిపించాడు. ఎప్పుడు పేదవాడివి, మీ దగ్గర డబ్బులు లేవు అంటూ రామును దూరంగా ఉంచిన భీమ్ తన తప్పును తెలుసుకున్నాడు.
                    ఇద్దరి మధ్యన సంభాషణ గమనించిన మాస్టర్ విద్యార్థులందరినీ సమావేశపరిచి పేద ధనిక, కులం మతం  అంటూ ఎలాంటి విషయాలు కూడా చిన్నారులు మాట్లాడుకోవద్దని, మనం ఎవరినైతే ఎక్కిరిస్తామో వారి కుటుంబంలో మనం జన్మిస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించాడు. మాస్టర్ మాటలకు విద్యార్థులందరిలో మార్పు వచ్చింది. పేద ధనిక అనే పేద భావం లేకుండా, అందరూ కలిసిమెలిసి చదువుకోసాగారు.
కామెంట్‌లు