ముద్ద మందారాలు;- -గద్వాల సోమన్న,9966414580
ముద్ద మందారాలు
ముద్దులొలుకు బాలలు
హద్దుల్లో ఉండే
శుద్ధమైన హృదయులు

సద్దు చేయు పిల్లలు
బుద్ధిలోన శ్రేష్టులు
వృద్ధి మార్గంలోన
ఉద్ధరించు మాన్యులు

అద్దంలాంటి వారు
సాటి వారికి లేరు
కఠిన మనస్కులు కారు
ఎవరు పోటీ రారు

బలే బలే బాలలు
భగవంతుని రూపులు
తూర్పున ఉదయించే
ఉషోదయ కిరణాలు

వెలుగులీను ప్రమిదలు
తెలుగులో మధురిమలు
సంగీత సరిగమలు
సెలయేరుల గలగలలు

ఆశల హరివిల్లులు
సొగసుల పొదరిల్లులు
సదనంలో బాలలు
గగనంలో చంద్రికలు

వెన్న ముద్ద మనసులు
వెన్నెలమ్మ జల్లులు
చిన్నారులు మహిలో
మహనీయులు మదిలో

పువ్వుల్లో తావులు
నవ్వుల్లో వెలుగులు
చిట్టి చిట్టి పిల్లలు
మట్టిలో మణిక్యాలు


కామెంట్‌లు