సెలయేరులు;- -గద్వాల సోమన్న,9966414580
సెలయేరుల పరుగులు
వినిపించే గలగలలు
సంగీత సరిగమలు
వీనులకు  మధురిమలు

అడుగడుగునా సౌరులు
ఎన్నెన్నో మలుపులు
సెలయేరులో ఉండును
కనువిందు చేయును

కొండల్లో జన్మించి
ప్రకృతిలో పయనించి
మనిషికి తోడ్పడును
దాహార్తి తీర్చును

మానవ జీవితమే!
చూడగ సెలయేరులు
మహిలో అద్భుతమే!
అవే తీపి గుర్తులు


కామెంట్‌లు