కలుపుగోలుతనము;- -గద్వాల సోమన్న,9966414580
కలుపుగోలుతనము
తెలుపు గొప్పతనము
గెలుపుకాధారము
మలుపుకది ద్వారము

సమైక్యతకు బాట
చక్కనైన కోట
కలుపుకుని పోతే
ప్రేమలొలుకు ఊట

సాటి లేని గుణ

ము
అదే మూలధనము
ముడివేయు బంధము
అత్యంత సుందరము

మనసులను తాకును
మమతలను పంచును
కలుపుగోలుతనము
బ్రతుకున అవసరము

కామెంట్‌లు