రేపటి భారత పౌరులం- -గద్వాల సోమన్న,9966414580
మిలమిల మెరిసే తారలం
గలగల పారే యేరులం
రేపటి భారత పౌరులం
కిలకిల నవ్వే పిల్లలం

తళతళమనే మెరుపులం
కళకళలాడే బాలలం
మేమే లేకపోతే ఇక
వెలవెల పోవును గృహములు

భారతి మెడలో మాలలం
నిత్యం వెలిగే ప్రమిదలం
మేమే మేమే సైనికులం
భరతమాత వారసులం

స్వేచ్చగ ఎగిరే పక్షులం
పచ్చగ మొలసే మొలకలం
కపటమెరుగని కూనలం
కాంతులు రువ్వే భానులం


కామెంట్‌లు