రేపల్లె వాడలో... గోపాలుడే...
ఆల మందలను గాచినాడే !
చెర సాలలోన బుట్టి నాడే....
గోకులమునకే జేరినాడే... !
దేవకి కడుపున బుట్టినాడే...
యశోద బిడ్డగ పెరిగినాడే.. !
వసుదేవ తనయుడే వీడు....
నంద నందనుడు ఐనాడే... !
గోప బాలురతో కూడినాడే ...
ఆట, పాట లతొ గడిపినాడే !
వెన్న, మీ గడ లతో పాటు...
పడతుల మనసులు దోచినాడే
గో వర్ధన గిరి నెత్తి నాడే ....
గొల్ల లందరిని గాచినాడే... !
కా ళీయుని మద మణచి నాడే
కంస మామను జంపినాడే.. !
నల్లని రంగు కలవాడే......
ఎర్ర కలువల కళ్ళవాడే... !
కాళ్లకు గజ్జెలు కట్టినాడే....
సిగలో నెమలీక పెట్టినాడే.. !
పిన్నల గ్రోవిని ఊదు తాడే...
పరవశం లొ ముం చెత్తుతాడే !
వెన్న లాగె మన్ను తిన్న వాడే..
నోట ప్రపం చమునేచూపినాడే
చూపుకు చిన్న పిల్లవాడే....
పెద్దరాక్షసులెందరినొజంపినాడే
రాధ తోడ తను కూడి నాడే..
రాస క్రీడలే ఆడి నాడే.... !
చీరెలనే అం దించి నాడే...
ద్రౌపది మానము గాచినాడే !
పాండవుల కండ ఐనాడే.....
రాయబారిగా వెడలి నాడే.. !
పార్ధ సారధి గ మారినాడే....
భగవ ద్గీతనే బో దించినాడే..!
జగద్గురువె తా నైనవాడే......
జగతికి సుగతిని చూపినాడే !!
.
జగతికి సుగతిని చూపినాడే
జగతికి సుగతిని చూపినాడే !!
. *******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి