నంది (బాల పంచపది)- ఎం. వి. ఉమాదేవి.
సంఖ్య -906
=========
శివునికై నంది తపసు చేసెను
హరుడు మెచ్చి అవతరించెను
ఏమి వరములు కోరుకోమనెను
నీ ఎదుటనేను ఉండకోరు టను 
చిరకాలము చిరంజీవయే ఉమా!

మధ్యప్రదేశ్లో జబల్పూర్ నందున
నర్మదా నది తీరము నందున
త్రిపూర్ తీర్థ క్షేత్రం నందున
పర్వతంపైనుండే నందిగుడిన 
ఆలయాలెన్నో వెలిసినవే  ఉమా!

అధికారజెండాపై శైవులకును
నంది జెండాఉంది తమినాడును
రవిశాస్త్రిగారు రూపొందిoచెను
రత్మలానాలోన ఎగురవేసెను
అపురూపం నందికేశజెండా ఉమా!

మందిరమందున నందిదర్శనము
దక్కును ఎంతో పుణ్యపు ఫలము
భస్మము వేసి నమస్కరించుము
చెవులమధ్యలో శివ దర్శనము
హరునికి ప్రీతికలిగించు ఉమా!!
కామెంట్‌లు