ఇరువురం;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 ఒక స్వప్నం
కంటిపాపమీద నిదురలేవక ముందే
ఒకకోరిక
మనసులో వళ్ళు విరుచుకోక ముందే
ఒక భావం
కంఠంలో నుండి వెలికిరావడానికి
భాష లేక విలవిలలాడక ముందే
కళ్ళు మూస్తే
కలల కలకలం
కళ్ళు తెరిస్తే
నువ్వులేని వంటరితనం
నీ జ్ఞాపకం నా మనసుమీద
పచ్చబొట్లు పొడుస్తోంది!
మౌనంగా, ముగ్ధంగా
నీ కదలికల్ని గమనిస్తూ ఉండాలన్న కోరిక 
ఒక్కటే అనుక్షణం! 
కోల్పోయిన ఏదో అనుభూతికోసం 
విరిసీవిరియని పువ్వులా 
తెలిసీ తెలియని కోరిక ఏదో 
మన ఆనందంలోని 
రహస్యాన్ని రాబట్టాలని
సృష్టికూడా ఆగింది
నిదురా, కలా 
ఏరూ, ఏటిఅలా
వీటిని విడదీయడం ఎలా?
అలాగే 
నువ్వూ, నేనూను!!
*********************************

కామెంట్‌లు