ఈమాటలు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఈమాటలు
మంత్రంబుకావాలి
ముగ్ధులనుచెయ్యాలి
మనసులనుముట్టాలి

ఈపలుకులు
తేనెలుచిందాలి
తీపినికూర్చాలి
తృప్తినిచేర్చాలి

ఈఅక్షరాలు
ఊహలనులేపాలి
ఉత్సాహమునివ్వాలి
ఉల్లములనిలవాలి

ఈపదాలు
అధరాలకెక్కాలి
అమృతంపుట్టించాలి
ఆనందంకలిగించాలి

ఈపంక్తులు
అద్భుతముగామారాలి
ఆశ్చర్యంకలిగించాలి
అంతరంగాలతట్టాలి

ఈరాతలు
పఠింపచేయాలి
ప్రోత్సాహపరచాలి
పరవశమందించాలి

ఈసృజన
కాంతులుచిమ్మాలి
మోములువెలిగించాలి
శాశ్వతముగనిలవాలి

ఈధార
వరదలాపారాలి
వైవిధ్యంచూపాలి
విన్నూతనంగాసాగాలి

ఈకవిత
నోర్లలోనానాలి
చెవుల్లోదూరాలి
తలల్లోదాగాలి

ఈకవులు
కలకాలముండాలి
కవనముసాగించాలి
ఖ్యాతినిపొందాలి

కామెంట్‌లు