నిను వీడను;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 నీ రూప లావణ్యాలతో
నన్ను నీవైపు లాక్కున్నావు 
నీ చిరునగవుల అందాలతో
నా చూపు నీవైపు లాక్కున్నావు
నీ అందమైన నడకలతో
నా మనసును నీవైపు లాక్కున్నావు
నీ ప్రియమైన మాటలతో
నా హృదయాన్ని నీవైపు లాక్కున్నావు
నీ ఆదర్శమైన నడవడికతో
నన్ను నిలువెల్లా నీవైపు లాక్కున్నావు 
అందుకే ప్రియా!
నా జీవితాంతం నినువీడను!!
*********************************

కామెంట్‌లు