ప్రకృతి ధర్మం (బాల గేయం)- ఎడ్ల లక్ష్మి
పువ్వులా నవ్వమ్మా
పుప్పోడిని చల్లమ్మా
పులకరించి చూసి
పలకరించి పోవమ్మా

పిందెలా ఉండమ్మా
ఆకు చాటుకు దాగమ్మా
కాయల ఎదిగి నీవు
పండులా మారమ్మా

విత్తనాలన్నీ వెదజల్లి
మొలకై మొలుచి మళ్లీ
వృక్షమై పెరిగి నీవు
వన సంపద పెంచు తల్లి

పువ్వు కాయ పండమ్మా
ఆడపిల్లతో ఉండమ్మా
మీరు ఒకరికొకరు తోడు
ప్రకృతి ధర్మము చూడమ్మా


కామెంట్‌లు