అనుదినమూ అవనికి వచ్చు
అందాల ఆమనిలా
కనక వర్ణ కిరణాలతో
కనికరించు కరుణాకరుడు
ఉప్పొంగు భావాల
ఉరికేటి అలలన్నీ
ఉదయకిరణాల రాకతో
ఉరుకులు అపి వందనములుచేసె!
నిట్టూరుపుల నిశికి సెలవంటూ
తూరుపున వెలిగే గగన దీపం
ఉసూరుమని నిలచిన
ఉర్వికే ఓదార్పుగ నిలుచు రూపం
కాలమై తోడుగా నడచి
చెలిమితో నీడగా వచ్చి
కలిమిలా సుఖముల తెచ్చు
ఎనలేని వరముల ఇచ్చేటి దైవం
మధుమాసపు శుభవేళ
మామిడి కొమ్మపై నుండి
మనసుతీర పాడు
మధురాలాపనల కోయిలల్లే
మౌనముగ మురిసేటి
మానస సరోవరములో
తిరిగేటి హంస వంటి
మురిపాల ముచ్చటల్లే
విరిసి మెరిసే ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి