రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశాలమేరకు
జిల్లా అంతర పాఠశాలల క్రీడా పోటీలు (గ్రిగ్స్) రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు కొత్తూరు మండల స్పోర్ట్ ఆర్గనైజర్ జన్ని చిన్నయ్య తెలిపారు.
ఈనెల పద్నాలుగు పదిహేను తేదీలలో కురిగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ మండల స్థాయి పోటీలు జరుగుతాయని ఆయన అన్నారు.
వాలీబాల్, కబడ్డీ, ఖోఖో తదితర పోటీలు సీనియర్ జూనియర్ విభాగాల్లో జరుగుతాయని చిన్నయ్య తెలిపారు.
బాలురకు బాలికలకు వేర్వేరుగా ఈ పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
కురిగాం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.ఈశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పోటీల నిర్వహణ ఏర్పాట్ల నిమిత్తం ఎం.ఎస్.ఓ. జన్ని చిన్నయ్యతో పాటు
సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు రాజారావు, భాస్కరరావు, రామకృష్ణ, కృష్ణవేణి, శ్రీనివాసరావు తదితరులు సమావేశమయ్యారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి