స్ఫూర్తి దాతలు! అచ్యుతుని రాజ్యశ్రీ
 కేరళకి చెందిన నౌజిషా కంప్యూటర్ లో డిగ్రీ చేసి ఓకాలేజీలో  గెస్ట్ లెక్చరర్ గా తన కెరీర్ ప్రారంభించింది.2013 లో పెళ్లి ఆపై భర్తతో తన్నులు తిట్లు చివాట్లు రోజూ ! అతనికి ఇంకో స్త్రీతో అక్రమ సంబంధం ఉంది.ఓకొడుకు పుట్టాడు.గృహహింస భరించలేక 2016 లో విడాకులు తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.లెక్చెరర్ గా పనిచేస్తూ 2021లో కేరళపోలీస్ స్పెషల్ రిక్రూట్మెంట్ పరీక్ష పాసై నేడు సివిల్ పోలీసు ఫోర్స్ లో శెభాష్ అన్పించుకుంటోంది.తన కొడుకుకి ఆదర్శమాతగా గా ఉంది.
పెట్రీషియా నారాయణ చెన్నై కి చెందినామె.చిన్న తోపుడు బండిలో సరుకులు అమ్మేది.17 వ ఏట వేరే మతానికి చెందిన వాడిని ప్రేమించి పెళ్లాడింది.పుట్టింటివారు మొహం చూడలేదు.భర్త డ్రగ్ ఎడిక్ట్ కావడంతో పాటు రోజూ చావచితక బాదేవాడు.ఇద్దరు పిల్లల తల్లి ఐన ఆమె మెరీనా బీచ్ లో తోపుడు బండిలో తినుబండారాలు అమ్మి రోజూ 50రూపాయలు సంపాదించి పిల్లల్ని పోషించింది.ఆపై స్లం క్లియరెన్స్ బోర్డు నేషనల్ మానేజ్మెంట్ ట్రైనింగ్ స్కూల్ లో కాంటీన్ నడిపే జాబ్ దొరికింది.కూతురి పెళ్లి కూడా చేసింది.కానీ యాక్సిడెంట్ లో కూతురు అల్లుడు చనిపోయారు.దుఃఖాన్ని దిగమింగి కొడుకు లో ఆశలు నింపుకుంది.కూతురుపేరు మీద సందీపా రెస్టారెంట్ ప్రారంభిం చింది.ప్రస్తుతం 14 ఔట్ లెట్స్ 200 మంది సిబ్బంది తో డైరెక్టర్ గా ఉంది.2010 లో ఆంత్రపెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందింది 🌹

కామెంట్‌లు