నవ్వులజల్లులు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
నవ్వులు
పిలిచాయి
కైతలు
కూర్చమన్నాయి

నవ్వులు
తట్టాయి
ఊహలు
ఊరాయి

నవ్వులు
నోర్లుతెరచాయి
అక్షరాలు
చేతికిచిక్కాయి

నవ్వులు
పలికాయి
పదాలు
ప్రవహించాయి

నవ్వులు
కవ్వించాయి
కలాలు
పట్టించాయి

నవ్వులు
చిందిస్తా
మోములు
వెలిగిస్తా

నవ్వులు
కురిపిస్తా
మేనులు
మురిపిస్తా

నవ్వులు
సంధిస్తా
బాధలు
తరిమేస్తా

నవ్వులు
చల్లుతా
మదులు
ముట్టుతా

నవ్వులు
విసురుతా
హృదులు
నింపుతా

నవ్వులు
పూయిస్తా
పరిమళాలు
చల్లేస్తా

నవ్వులు
పారిస్తా
నాపచేలు
పండిస్తా

నవ్వులు
మొలిపిస్తా
అందాలు
చూపిస్తా

నవ్వులు
వెలిగిస్తా
మేనులు
మురిపిస్తా

నవ్వులు
వడ్డిస్తా
కడుపులు
నింపేస్తా

నవ్వులు
వినిపిస్తా
గంతులు
వేయిస్తా

నవ్వులు
చూపిస్తా
కళ్ళను
కట్టేస్తా

నవ్వులు
అందిస్తా
నిరాశలు
తొలిగిస్తా

నవ్వులు
మనోహరాలు
మధురిమలు
మనుగడలు

నవ్వులని
పట్టుకోండి
పలువురికి
పంచండి

మీరు
నవ్వండి
తోటివాళ్ళను
నవ్వించండి


కామెంట్‌లు