ఓ వానా!- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
వానా వానా
స్వాగతం సుస్వాగతం
నింగినుండి దిగు
నేలతల్లిని తాకు

వానా వానా
రాలు రాలు
పిల్లలనాడించు
బాలలపాడించు

వానా వానా
రా రా
పుడమిని తడుపు
పంటలు పండించు

వానా వానా
కురువు కురువు
కుంటలు నిండించు
చెరువులు పూరించు

వానా వానా
వచ్చేయి వచ్చేయి
నదులు పారించు
సెలయేర్లు సాగించు

వానా వానా
చిటపటమను
చినుకులు చల్లు
చిన్నారుల చిందులేయించు

వానా వానా
టపటపమను
కప్పలనరిపించు
చేపలనీదించు

వానా వానా
డబడబా వంగు
కరువును పారద్రోలు
కష్టాలను కడతేర్చు
 
వానా వానా
కాపాడు కాపాడు
కర్షకులను రక్షించు
కూలీలకు పనులివ్వు

వానా వానా
జల్లులు చల్లు
వాతావరణం చల్లపరచు
వసుధను పచ్చబరుచు

వానా వానా
వందనం వందనం
మనసుల మరిపించు 
మనుజుల మురిపించు 


కామెంట్‌లు