గురజాడ(బాలగేయం..)- ; ఉమాగాంధి
తెలుగు వెలుగుకు
 గొడుగు పట్టిన
 గిడుగు అనుచరుడు
గురజాడ మన వాడు..

ఉత్తరాంధ్రకు ఎత్తు కెత్తిన
సత్తువున్నో డు..
గురజాడ మన వాడు..

రాయవరమున పుట్టినాడు
 బిరుదు కవిశేఖరుడు .
గురజాడ మన వాడు..


దురాచారము దూసినాడు..
సంఘ సేవకుడు..
గురజాడ మన వాడు..

ముత్యాల సరములు పేర్చినాడు..
 నిత్యం వెలుగు సూర్యుడు .
గురజాడ మన వాడు..


కామెంట్‌లు