శ్రీ రాముడు ; కొప్పరపు తాయారు
 పంచ సేన అగ్రగాన్ హత్వా సప్త మంత్రి సుతాన్ అపి 
శూరం అక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్ |
అస్త్రేణ ఉన్ముక్తం ఆత్మానం జ్ఞాత్వా పైతామహాత్ వరాత్ |
మర్షయన్ రాక్షసాన్ వీరో యంత్రిణః తాన్ యదృచ్ఛయా |
తతో దగ్ధ్వా పురీం లంకాం ఋతే సీతాం చ మైథిలీం |
రామాయ ప్రియం ఆఖ్యాతుం పునః ఆయాత్ మహాకపిః |
సః అభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణం 
న్యవేదయత్ అమేయాత్మా దృష్టా సీతా ఇతి తత్త్వతః
వాయుసుతుడు ఐదుగురు సేనాపతులను అంతమొందించెను, ఏడుగురు మంత్రిపుత్రులను మట్టిగఱపించెను. శూరుడైన అక్షకుమారుని హతమార్చెను. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు బుద్ధిపూర్వకముగా కట్టుబడెను. నిరుపమాన పరాక్రమశాలియైన వాయునందనుడు బ్రహ్మవరప్రభావమున బ్రహ్మాస్త్రమునుండి అప్రయత్నముగా తాను విముక్తుడైనట్లు తెలిసికొనెను. ఐనప్పటికిని హనుమంతుడు రామకార్యమును సాధించుటకై బ్రహ్మాస్త్రమునకు బద్ధుడైయున్నట్లు నటించుచు, రాక్షసులుపెట్టు  సహించెను. !
రావణాజ్ఞననుసరించి, రాక్షసులు తనతోకకు నిప్పంటింపగా) మారుతి తనవాలాగ్నితో సీతాదేవి ఉన్న స్థలమునుదప్ప లంకను దగ్ధము గావించెను. సీతాదేవికుశలవార్తను దెలిపి, శ్రీరామునకు ప్రీతిని గూర్చుటకై ఆ హనుమంతుడు అతి శీఘ్రముగా ఆ ప్రభువుసమీపమునకు మఱలివచ్చెను. మహాబుద్ధిశాలియైన పవనసుతుడు "కనుగొంటిని సీతమ్మను" అని పలికి, రామునకు ప్రదక్షిణమొనర్చెను. సీతాదేవి యెడబాటునకు లోనయ్యును, 
నిశ్చలుడై యున్న ఆ ప్రభువునకు ఆ వాయుసుతుడు యావద్వృత్తాంతమును వివరించెను. !
               ఓం శ్రీ రామం
                ****


కామెంట్‌లు