పంచాయుధ స్తోత్రమ్ వైశిష్ట్యం- సి.హెచ్.ప్రతాప్
 అన్ని స్త్రోత్రాలలో కెల్లా మహా శక్తివంతమైనది పంచాయుధ స్తోత్రమ్ అని ఆధ్యాత్మిక వేత్తల అభిప్రాయం.
శ్రీ మహా విష్ణువు ధరించే అయిదు ఆయుధాల విశిష్ట్యం తెలిపే ఈ స్తోత్రం నిత్యం పారాయణం చేయడం వలన ఆర్థిక బాధలు, శత్రు బాధలు , అనారోగ్య బాధలు, గొప్ప ఆపదలు తొలగిపోతాయని అశేష భక్తజనావళి యొక్క  విశ్వాసం. శ్రీ మహావిష్ణువు ధరించే అష్ట ఆయుధాలు : అష్ట ఆయుదాలు -
1) శంఖము; 2) చక్రము; 3) చర్మము (డాలు); 4) శార్ఙ్గము (విల్లు); 5) ఖడ్గము; 6) శరము; 7) పాశము; 8) గద.
వీటితో సహితుడైన శ్రీ మహావిష్ణువును కీర్తించి, ప్రార్ధిస్తే అష్ట కష్టాలు తొలగుతాయని శ్రీ విష్ణు పురాణం తెలియజేస్తోంది.  
 
జలమునందెల్లపుడూ ఏ ఆపదలు దరి చేరకుండునట్లు శ్రీ వరాహస్వామి కాపాడుగాక, భూమిపై ఏ ప్రమాదములు సంభవించకుండునట్లు శ్రీ వామన మూర్తి మనలను బ్రోచుగాక ,!
అడవులలో ఘోర ప్రమాదములలో చిక్కుకొనకుండ శ్రీ నరసింహస్వామి కాపాడుగాక,
 
 బ్రహ్మకు శివునికి తన దేహమందే స్థానము నిచ్చిన సర్వజగత్కారణుడగు కేశవుడు సదా రక్షించుగాక  అని పై స్త్రోత్రం తెలియజేస్తోంది.

దేవతలు ధరించిన ఆయుధాలు జడశక్తులు కావు. అవి ఆ దేవత యొక్క లీలా విభుతులు . ఆయుధాలకు కూడా ప్రత్యేక అధిష్ఠాన దేవతలు,మంత్రాలు ఉన్నాయి. ఆయా మంత్రాలను అనుష్టించిన వారిలో ఆ ఆయుధశక్తులు ప్రతిష్టితమైన అమోఘ కార్యాలను సాధిస్తాయి.సుదర్శన దేవతా మంత్రాలు,సుదర్శన హోమాలు మనకు పరిచితమే. చక్రదేవత ,శంఖ దేవత భరత శత్రుఘ్నులుగా అవతరించారు కూడా. ఇలా ఆయుధాలు కూడా చైతన్య స్వరూపాలు. దుష్టశిక్షణ,శిష్టరక్షణ చేసే భగవద్కారుణ్యం ఈ ఆయుధాల ద్వారా వ్యక్తమవుతుంది. ఈ ఆయుధాలు మనల్ని కాపాడాలని ప్రార్థించితే చాలు – ఆ దేవతల ప్రసాదంతో మనకు సర్వరక్ష లభిస్తుంది. ”ఏ వింటినారి మ్రోతచేత దేవ తల మనసులలోని భయం తొలగి రాక్ష సులపై పిడుగుల వంటి బాణ వర్షం కురు స్తుందో అటువంటి శార్గ్ఞ ధనువును నేను శరణు వేడుతున్నాను” అంటుంది పంచా యుధ స్తోత్రం.


వేదం కీర్తించినట్లు పంచాయు ధాలు భగవంతునికి అలంకారాలు. చక్రం మనస్త త్వాత్మకం, శార్గ్ఞం గుణ తత్వాత్మకం, కౌమోదకి బుద్ధి త త్వాత్మకం, నందకం జ్ఞానతత్వాత్మకం, ధనువు అహం కార తత్వాత్మకం.
వీటితో భూషితుడైన సర్వప్రహరణాయుధుడు ఆ శ్రీహరి సర్వ జగద్రక్షకుడై ఉండగా మనకు భయమేల ? 


కామెంట్‌లు