సంఖ్య -909
సారేజహాసే అచ్ఛాయని పాడెను
హిందూస్తాన్ హమారాయని చాటెను
అల్లామా మొహమ్మద్ ఇక్బాల్ ను
జాతి మొత్తమూ ప్రశంశించెను
జాతీయతాభావo కలిగించే ఉమా!
అలనాటి పంజాబు రాష్ట్రంలోను
సియాల్ కోటలోన జన్మించె ను
నూర్ అహమ్మద్, ఇమామ్ బీబీలను
పుణ్యదంపతులు తల్లిదండ్రులును
పండితులతో విద్యాభ్యాసము ఉమా!
లాహోరున ఉన్నత విద్యసాగెను
తత్వశాస్త్రాన అధ్యాపకుడుగాను
ఉర్దూ కవిత్వంపై మక్కువతోను
దేశభక్తితో కవిత్వం వ్రాసెను
మంచికవిగా గుర్తింపు పొందే ఉమా!
ఇత్తేహాద్ వారపత్రిక యందును
బాంగ్ ఈ దారా గ్రంథములోను
సారే జహసే ప్రచురణ పొందెను
ఉన్నతవిద్యకి లండన్ వెళ్లెను
న్యాయశాస్త్రం డిగ్రీ చేసె ఉమా!
పిహెచ్ డి సాధించి తర్వాతను
అఖిలభారత ముస్లిం లీగ్ లోను
స్వదేశీ ఉద్యమాన్ని బలపర్చేను
ప్రాక్టీస్ పెట్టి ముస్లిం సమస్యలను
ధార్మిక కోణం పరిష్కారo ఉమా!
పర్షియన్ కవై తత్వ రచనలు
ఇస్లాం తత్వవేత్తగా శ్రద్ధలు
సర్ సయ్యద్ ప్రభావములు
ముస్లిం విద్యలో అధిక సేవలు
పేదరికం గూర్చి లీగ్‌లో చెప్పే ఉమా!
పలుగ్రంథాల సృజనచేసె ను
పలుభాషానువాదo జరిగెను
రాజకీయంలో ప్రత్యేక పాత్రను
స్వజనుల సంక్షేమము కోరెను
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి