తావి లేక
పూవునిలువలేదు
పూవు లేక
తావి నిలువలేదు
పువ్వుతావి ముచ్చటైనజంట
అందము లోనే
ఆనందమున్నది
ఆనందము లోనే
అందమున్నది
అందమూఆనందమూ అందరికీ అవసరము
తలలు లేక
తలపులుండవు
తలపులు లేని
తలలుండవు
తలలే తలపులకుమూలం
రాత్రులు లేక
పగల్లుండవు
పగల్లు లేక
రాత్రులుండవు
అహర్నిశలు రోజుకుసేవకులు
ఉదయించే సూరీడు
అస్తమించకమానడు
అస్తమించే సూరీడు
ఉదయించకమానడు
రవి నిత్యసంచారి
బంధాలు లేక
అనుబంధాలుండవు
అనుబంధాలు లేక
బంధాలునిలువవు
బంధానుబంధాలే ప్రేమద్వారాలు
విత్తుల నుండి
చెట్లువస్తాయి
చెట్లనుండి
విత్తులువస్తాయి
ఏదిముందో చెప్పుటకష్టము
వర్షాలు లేకపోతే
చెట్లుండవు
చెట్లు లేకపోతే
వర్షాలుండవు
ప్రజలకు రెండూముఖ్యం
వాక్కు
అర్ధమునిస్తుంది
అర్ధము
వాక్కునిస్తుంది
వాక్కును అర్ధాన్ని విడగొట్టలేము
భర్త లేక
భార్య ఉండలేడు
భార్య లేక
భర్త ఉండలేడు
ఆలుమగలు అనురాగాలకు ప్రతీకలు
అక్షరాలు లేక
పదాలుండవు
పదాలు లేక
అక్షరార్ధాలుండవు
అక్షరపదాలనుబంధమే కైతలకమ్మదనం
కవులు లేకపోతే
కవితలుండవు
కవితలు లేకపోతే
కవులుండరు
కవితలుచదవాలి కవులనుప్రోత్సహించాలి
కవితలు
కమ్మదనాన్నిస్తాయి
కమ్మదనాన్ని
కవితలిస్తాయి
కయితలకమ్మదనాలను క్రోలాలి
ప్రకృతి లేకుంటే
పురుషుడికి ఉనికిలేదు
పురుషుడు లేకుంటే
ప్రకృతికి ఉనికిలేదు
ప్రకృతిపురుషుడు పరస్పరాధారితాలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి