శ్రీశివ లీలాzమృత తరంగిణి "కవి మిత్ర" శంకర ప్రియ శీల.,-సంచార వాణి:- 99127 67098
 🔱శివలీలాzమృతం నుండి
   వచ్చినదీ తరంగిణి!
   శ్రీశివానంద లహరి!
   ఓ శంకర ప్రియులార!
         [ అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ., ]
🔆శ్రీశివ లీలాzమృత తరంగిణి.. సాంబశివ పరంబ్రహ్మము నుండి ఆవిర్భవించింది! భక్తిజ్ఞాన ప్రపూర్ణమైనది! విజయ పరంపర విభవము నొసంగునది! జన్మసార్థకం చేయునది! ఆ శివానంద లహరి.. మనచిత్తము నందు ఎడబాయకుండా, సుస్థిరంగా నుండుగాక! అని, మనమంతా శ్రీమన్మహాదేవుని, శివుని వేడుకోవాలి!     
 🔱శంభోశంకరా! నీ "చరిత"మనెడు జీవనది నుండి ప్రవహిoచుచూ;
 "పాపము"లనెడు ధూళిని అణచివేయుచూ; "బుద్ధి"యనెడు కాలువలందు చేరినది! జననమరణ రూపమైన, "సంసారము"నందు పరిభ్రమించుట వలన కలుగు సంతాపమును ఉపశమింప జేయు చున్నది. (అనగా, భక్తులందరికీ శాంతిని.. ముక్తిని.. అనుగ్రహించు చున్నది)! అది.. నా "చిత్త"మనెడు మడుగు నందు స్థిరముగా నిలిచి యుండునది యగు,"శ్రీ శివానంద లహరి" ఉత్కృష్టమై యుండుగాక! అనగా.. శ్రీశివా శివుల "ధ్యానము, దర్శనము"ల వలన కలుగు, "ఆనంద"మనెడు ప్రవాహము.. విజయము పొందుగాక! అని, పరమేశ్వరుని ధ్యానించాలి!
🚩జగద్గురు ఆది శంకరులు .. "శ్రీ శివానంద లహరి"యందు ఈవిధంగా ప్రార్థన కావించారు!
👌గళంతీ శంభో! త్వచ్చరిత సరితః, కిల్బిష రజో 
      దళంతీ, ధీకుల్యాసరణిషు పతంతీ, విజయతామ్! 
     దిశంతీ సంసారభ్రమణ, పరితాపోప శమనం,
     వసంతీ మచ్చేతోహ్రద భువి, శివానందలహరీ!!
         ( శ్రీశివానంద లహరి., 2.వ. శ్లోకము.,)
            🔆🌻🔆
    🚩తేట గీతి పద్యము
      స్వామి! భవదీయ చరిత స్రవంతి నుండి
     పర్వు వెట్టుచు, నడగించి పాపరజము, 
     బుద్ధికుల్యల బడి సాగి, పోయి పోయి
     సంసృతి భ్రమ పరితాపశాంతి గూర్చి, 
    యస్మదీయ చేతోహ్రద మందు జేరు
      శ్రీ"శివానంద లహరి" యుత్కృష్ట మగుత!!
          [ఆంధ్రీకరణ: డా. జొన్నలగడ్డ మృత్యుంజయ రావు.,]

కామెంట్‌లు