హరివిల్లు రచనలు కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,9440522864.
 హరివిల్లు 561
🦚🦚🦚🦚 
వ్యక్తి లోని గొప్పదనం
పసిగట్టే నిపుణత్వం.....!
అభినందించే సుగుణం
వృద్ధితో వ్యాపకత్వం....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 562
🦚🦚🦚🦚
నిత్యము మన మదిలోన
సత్యపలుకుల చింతనలు..!
త్యాగ గుణము తోడై
సత్య దారికి పయనాలు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 563
🦚🦚🦚🦚
మిడిమిడి జ్ఞానంతో 
తడబడు అడుగులు...!
గుండె దడదడలతో
గజగజ వణుకులు.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 564
🦚🦚🦚🦚
వితండ వాదనల 
కన్న సర్దుబాట్లు మిన్న....!
అర్థహీనపు మాటల 
కన్న మౌనమే మిన్న......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 565
🦚🦚🦚🦚
బిత్తర చూపులు ఒదిలి
ఉత్తమ జిజ్ఞాస పెంచు....!
చిత్తపు గూటికి భక్తి
పొత్తపు విత్తులందించు.!!
               ( ఇంకా ఉన్నాయి )


కామెంట్‌లు