మల్లెలు -పల్లెలు (బాలగేయం );- రావిపల్లి వాసుదేవరావు-విజయనగరం జిల్లా-9441713136
మల్లెలు చూసి మనసులు మురిసెను!
పల్లెలు చూసి మది పులకించెను!
కల్లలు లేనీ పాపను చూసీ
ఎల్లలు మరిచెను! తనువును మరిచెను!

తరువులు చూసీ పరవసమొందెను!
చెరువులు చూసీ ఉల్లము పొంగెను!
కరువులు బాపే అడవిని చూసీ
గుండెలు నిండెను! సంతసమొందెను!

ఆటలు ఆడీ మోదము నొందెను!
పాటలు పాడీ హాయిని పొందెను!
నీతులు తెలిపే కథలను వింటూ
మమతలు నిండెను! మది ఉప్పొంగెను!

కామెంట్‌లు