ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు- ఏ.బి ఆనంద్- ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322
 రామాయణంలో ఉన్న  అనేక ధర్మాలు అందరికీ తెలిసినవే  అయితే దానిలో  ధర్మ సూక్ష్మాలు చెప్పగలిగిన అతి తక్కువ మందిలో  శ్రీ భాష్యం వారు  ప్రథమ స్థానంలో నిలుస్తారు. నాన్నగారు అడిగిన అనేక విషయాలను  వాల్మీకి మహర్షి అసలు కావ్యం నుంచి  ఉదాహరణలు ఇస్తూ  వారి కార్యక్రమం  పూర్తి చేసాం  కార్యక్రమం పూర్తయిన తర్వాత శ్రీ భాష్యం వారు అనేక మాధ్యమాలలో నేను మాట్లాడాను  అనేకమంది మేధావులు నన్ను ప్రశ్నించారు  కానీ ఈరోజు ఆనంద్ గారు డాక్టర్ కె వెంకట్ రాజు గారు  ప్రశ్నించి నా ద్వారా  సమాచారాలను రాబట్టిన  పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది  అని అభినందనలు తెలియజేశారు  వారికి మేము ఇద్దరం పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకున్నాం.
పక్కనే వారి పాద పూజ చేస్తున్న వారి శ్రీమతిని అమ్మా మీరు స్వామి గారిని గురించిమాట్లాడండి అంటే  నాకు అవేమీ తెలియవు  అయ్యవారి  పాదాలను వత్తడం తప్ప నాకు మరేమి తెలియదు  అన్నారు  నిజానికి శ్రీరామచంద్రుల వారికి  సీతాదేవి ఎలా  దొరికిందో అలా శ్రీభాష్యం వారికి ఆమె దొరికారు అని నాన్నగారు తరువాత  వారి అబ్బాయి తో మాట్లాడినప్పుడు  నాన్నగారు మాట్లాడడం వినడం తప్ప  దానిని ధారణ చేసి చెప్పే  సాహసం  చేయలేను అని చెప్పారు  శ్రీ భాష్యం వారి కోడలు  ఎం ఏ పి హెచ్ డి ఆంగ్ల భాషలో చేసింది వారితో రికార్డ్ చేస్తూ  భారతీయుల సంస్కృతీసంప్రదాయాలను  అనుక్షణం ఆచరిస్తున్న శ్రీమాన్  శ్రీ భాష్యం అప్పలాచార్యుల వారికి సాక్షాత్తు కోడలు అయి ఉండి  ఆంగ్లంలో చదవడం ఏమిటి అని అడిగాను.
మీరు చెప్పినది అక్షర సత్యం  వారి ఆచారాలను పుణికి పుచ్చుకొని  వారి పద్ధతిలోనే నేను నా జీవితాన్ని గడుపుతున్నాను  నన్ను మావయ్య గారు ఎప్పుడూ ప్రోత్సహించి ఎంఏ ఆంగ్లంలో చదివించారు  దానికి వారు చెప్పిన కారణం  నీ సమయం వచ్చేటప్పటికి ఆంధ్ర భాషకు  అవకాశాలు తక్కువగా ఉంటాయి  కనుక ఆంగ్లంలో  పీహెచ్డీ చేయమని చెప్పిన తర్వాతనే నేను ఈ పని చేశారు అని చెప్పారు ఏనాటికైనా భారతీయుడు అన్న ప్రతి ఒక్కరూ  చివరకు చిన్న స్వామి జియర్  లాంటి వాళ్లు కూడా శ్రీ భాష్యం వారిని అనుసరించి  భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను  నిలబెట్టిన  అతి తక్కువ మంది సనాతన  ఆచారాన్ని  అనుసరించిన వారిలో శ్రీ భాష్యం వారు ప్రథమ స్థానంలో  నిలిచి ఉంటారు.


కామెంట్‌లు