ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.
 చలం గారి గురించి స్వీయ  చరిత్రను  చెబుతూ  విజయవాడలో జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నారు  నాన్నగారు  ఒక సమాజాన్ని స్థాపించి దానిలో  రాత్రి సమయంలో భార్యాభర్తలు మాత్రమే వచ్చి ఎలా  అర్థరాత్రి 12 గంటలకు  దీపాలు తీసివేసిన తర్వాత  ఎవరు ఎవరో తెలియకుండా  ఒక స్త్రీ ఒక పురుషుడు సంగమించడం అనేది  వారు ఏర్పాటు చేసుకున్న నియమం  ఒకరోజు దురదృష్టవశాత్తు నాకు  నాన్నగారు దొరికారు  నియమం ప్రకారం. నాకు జీవితం పై విరక్తి కలిగి ఎక్కడికి వెళ్లాలో తెలియక బయలుదేరితే ఏదో ఒక  వెలుగు నాకు దారి చూయించి ఇక్కడకు  తిరువణ్ణామలై లో ఉన్న రమణ మహర్షి వారి దగ్గరకు తీసుకువచ్చింది  అలా నా జీవితం మలుపు తిరిగింది  అని చెప్పింది సౌరిస్ నేను 
తిరువణ్ణామలై వచ్చిన తరువాత కృష్ణ భిక్షు గారి సాన్నిహిత్యంతో  నన్ను నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను  తర్వాత స్వామివారికి ప్రథమ శిష్యురాలుగా  అక్కడే ఉన్నాను  నా ఆచూకీ తెలిసిన నాన్నగారు వచ్చిన తర్వాత  రమణ ఆశ్రమం ఎదురుగానే చలం ఆశ్రమం  అన్న పేరుతో మేమంతా అక్కడ ఉన్నాం నాన్నగారికి పని పాట లేదు రోజు రావడం స్వామివారిని చూడడం  వారు ఏకాంతంగా నేను కృష్ణ భిక్షు గారితో ఉన్నప్పుడు  ఏమయ్యా  గోచి కాకపోతే నాలాగా  బన్నీ  లుంగీ అయినా వేసుకోవచ్చు కదా  అని ఎద్దేవ చేస్తూ ఉండేవారు  స్వామి ఆ మాటలు విని  ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉండేవారు దాని ఆంతర్యం మాకు తెలియదు. ఇలా జరుగుతూ ఉన్న రమణ మహర్షి చివరి రోజున  నాన్నగారు ఎద్దేవా చేయడం మహర్షుల వారు అలా నాన్నగారిని తీక్షణంగా చూడడం  ఆ మరు క్షణం  వారి జీవాత్మ చిన్న వెలుగులా వెళ్లి నాన్నగారి  హృదయంలో  ప్రవేశించడం  ప్రత్యక్షంగా నేను కృష్ణ భిక్షు గారు చూశాం  ఆ మరుక్షణం నాన్నగారు స్పృహ లేకుండా పడిపోవడం  ఆ తర్వాత లేచి  స్వామివారి పాదాల చెంత ఎంతసేపు కన్నీరు కార్చుకుంటూ దుఃఖించారు  ఎంత మధనపడుతూ  తన అన్న మాటలకు సిగ్గుపడుతూ  గంటల తరబడి  అలా జరిగిన తర్వాత నేను  నాన్నగారిని ఒడిలోకి తీసుకుని సముదాయించాను  రెండు మూడు గంటలు జరిగిన తర్వాత గాని నాన్నగారు మామూలు స్థితికి రాలేదు అని చెప్పారు  సౌరిస్ గారు.



కామెంట్‌లు