ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారుఏ-.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 అన్నగారిని పరిచయ కార్యక్రమం కోసం టాక్స్ స్టూడియోకి తీసుకెళ్లి అక్కడ ఉన్న  ప్రశ్నలు అడగడానికి సిద్ధంగా ఉన్న బందా కనక లింగేశ్వర రావు గారిని  పరిచయం చేస్తే  కూర్చోబోయే వారు లేచి నిలబడి వారిని  ఒక నిమిషం పాటు చూసి  దగ్గరకు వెళ్లి పాదాభివందనం చేసి  బందా కనక లింగేశ్వర రావు గారూ  మీలాంటి పెద్ద వారిని కలవడం  నా పూర్వజన్మ ఫలం  మీ పేరు వినడమే కానీ మిమ్మల్ని చూసే భాగ్యం ఇప్పటివరకు కలగలేదు  మీ కృష్ణ పాత్ర అద్భుతం అని విన్నాం. ఏదైనా ఒక పద్యం పాడితే ఆనందిస్తాం అనగానే బందా గారు రెండు పద్యాలు చదివి వినిపించారు  సంస్కారం పుట్టి రామారావు గారు పుట్టాడా అనిపిస్తుంది  వారి పద్ధతిని  నడవడికను గమనించినట్లయితే
కనక లింగేశ్వరరావు గారు మేము సాయంత్రం నాటకం ఆడుతున్నాం  మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి  వ్యక్తిగతంగా ఎన్ని పాసులు ఇవ్వమంటారు    అని అడిగారు  మాకు కలెక్టర్ గారు పంపించారని సమాధానం చెప్పారు బందా గారు 
అక్కడ జరిగిన ఒక సంఘటన మీకు చెప్పాలి మా క్లాస్ ఫోర్ ఆఫీసర్స్  హెడ్ కనకారావు  అన్నగారి వెంటే వచ్చి  అన్నగారు మీరు మంచి నాటకం వేస్తున్నారు  ఎన్ని పాసులు ఇస్తారో  అనే సరికి ఎన్ని కావాలి బ్రదర్  వంద రూపాయలు ఇవ్వనా 500 ఇవ్వనా వెయ్యి రూపాయలు ఇవ్వనా  మీకెన్ని కావాలంటే అన్ని ఇస్తాను బ్రదర్ చెప్పండి  అనేసరికి  మెతుకు పోతే బ్రతుకు పోతుంది అన్న స్థితిలో జీవించే వ్యక్తి  కంగు తిన్నాడు  అన్నగారు హాస్యాలు ఆడుతున్నారు  అనగానే హాస్యాలు కాదు తమ్ముడు  ఏమంటారు అనేసరికి  ప్రక్కన ఉన్న మా అధికారి శ్రీ వాత్సవ గారు సర్ధి చెప్పి  బయటికి వచ్చి వారిని కారు ఎక్కించి పంపించారు తర్వాత మా కనకారావుకి  మెమో ఇచ్చి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు అని  సలహా ఇచ్చారు అధికారులు.
చైర్మన్ నాటకం  ప్రజలకు నచ్చినది  నేను డాక్టర్ రాజు గారు తండ్రి  బిడ్డలుగా నటించిన నాటకం  15 ప్రదర్శనలు అయిపోయిన తర్వాత డాక్టర్ రాజుగారు  నా ప్రాక్టీస్ దీనివల్ల దెబ్బతింటుంది  వేరే ఎవరినైనా చూడండి అని  సున్నితంగా చెప్పిన తర్వాత  సినీ నటులు ఏవి సుబ్బారావు గారిని పిలిచి వారి ఆధ్వర్యంలో మూడు ప్రదర్శనలు అయిన తర్వాత  లక్ష్మీ నర్సయ్యతో  నేను ఆనంద గారి వాయిస్ ముందు తేలిపోతున్నాను కనుక నేను నాటకం వేయను అని ఆయన మద్రాసు వెళ్లిపోయారు  ఆ తర్వాత కె వి ఎస్ శర్మ గారిని పిలిచి ఆ వేషం వేయించారు ఒకరోజు శర్మ గారు నన్ను పిలిచి నీ వాయిస్ చాలా బాగుంటుంది నా వాయిస్ లో జీర ఉంది  నీ వాయిస్ సున్నితంగా అన్ని స్థాయిలోనూ అద్భుతంగా పలుకుతుంది అని అభినందించారు.

కామెంట్‌లు