అక్షరాల ఆకాంక్ష;- -గద్వాల సోమన్న,9966414580
హాయిగా బ్రతకాలోయ్!
ఆదర్శం చూపాలోయ్!
ప్రేమగా ఉండాలోయ్!
అమృతమ్ము చిందాలోయ్!

మువ్వలా మ్రోగాలోయ్!
గువ్వలా ఎగరాలోయ్!
దైనందిన బ్రతుకులో
పువ్వులా విరియాలోయ్!

యేరులా పారాలోయ్!
తేరులా సాగాలోయ్!
అందరికి ఉపకరిస్తూ
నీరులా కావాలోయ్!

రెక్కలా మారాలోయ్!
మొక్కలా ఎదగాలోయ్!
జీవితకాశంలో
చుక్కలా వెలగాలోయ్!

 

కామెంట్‌లు