చిన్నాన్న;- -గద్వాల సోమన్న,9966414580
మా నాన్నకు తమ్ముడు
ప్రియమైన చిన్నాన్న
నాన్నకెంతో ఇష్టుడు
ప్రేమ గల చిన్నాన్న

ఆటలు ఆడించును
పాటలు విన్పించును
పనులలో నాన్నకు
మిగుల సహకరించును

బడికి తీసుకెళ్లును
గుడికి తోడొచ్చును
సినిమాలు చూపించి
సరదాలు తీర్చును

బొమ్మలు కొనిపెట్టును
ఇంటి పని చేయించును
చదువులో తోడ్పడి
భవిష్యత్తు దిద్దును


కామెంట్‌లు