పెద్ద నాన్న మనసు వెన్న;- -గద్వాల సోమన్న,9966414580
ఇంటిలోన  పెద్దోడు
పెద్ద మనసు ఉన్నోడు
మా పెద్ద నాన్న గుణం
వజ్రంలా ఘనం ఘనం

అందరినీ ప్రేమించును
అనురాగం చిందించును
కలుపుగోలుతనంతోడ
కుటుంబాన్ని నడిపించును

మా నాన్నకు సోదరుడు
గృహ సీమలో సూర్యుడు
ఇష్టమైన పెద్ద నాన్న
ఇంటి పెద్ద పెద్ద నాన్న

రథ సారథి వంటి వాడు
పెద్ద నాన్న ఠీవి చూడు
క్షేమాన్ని కోరు వారు
వారికెవరు సాటి లేరు


కామెంట్‌లు