తెలంగాణలో వెలుగును పంచే సూరీడు- డా.చీదెళ్ళ సీతాలక్ష్మి
తెలంగాణ వేగుచుక్క
అందరి నోటిలో బుక్క
వద్దండి మందు చుక్క
వెన్నెల పంచుతూ
వెలగాలి చుక్కల్లో చంద్రుడిలా
కలలు కన్న తెలంగాణ నేతగా
ఏలాలి అందరూ మెచ్చుకునే విధంగా!

గడీలను పగులగొట్టిన ఒక్క మగాడు
ప్రజాస్వామ్యం తెచ్చిన మొనగాడు

ప్రజల కన్నీళ్లను తుడువ
నడుం గట్టిన తెలంగాణ బిడ్డ
అందరి ఎదను దోచిన ధీరుడు
ప్రభుత్వ వ్యతిరేకతను చాటిన వీరుడు

తెగిన తంత్రులు అతికించి తెలంగాణ వీణను మీటి
ఆనందరాగాలు పలికించిన ఘనుడు
సామాన్య జనుల వేదన తీర్చ
జనం గొంతుకై పోరాటం చేసిన
అసామాన్యుడు
అందరికి మాన్యుడు
కాంగ్రెస్ నేత
ప్రజల నేత
అనుముల రేవంత్
ముఖ్యమంత్రిగా 
ప్రమాణం చేసే తరుణం
గగనం సైతం కురిపిస్తుంది సంతోషపు జల్లు
ముళ్ళును తొలగించి
రాళ్లను కరిగించి
పూలబాటను పరిచి
ఆనంద పరిమళాలు వెదజల్లి
సామాజిక న్యాయం చేయ 
కదిలివచ్చిన గర్వం లేని
కరుణ జూపు సామాన్య మానవుడు
పవర్ చూపించిన ఘనుడు!!

జనం బలం
జనం గళం
కదిలివచ్చిన సింహం
అసలైన తెలంగాణ
ఏర్పాటుకు జాణ
సామాన్యులకు అండ
అందరికి ఇచ్చును నీడ,!!
జయహో రేవంత్
వచ్చింది నీ వంతు!!

నీళ్లు నిధులు నియామకాల 
కోసం ఏర్పడ్డ తెలంగాణ
నిధులు కరువు
తేవాలి అరువు
నీ పాలనలో సాగును 
నియామకాలకు పాదులు
నిక్కమైన రాజ్యం
కారాదు భోజ్యం

మనసెరిగిన నాయకుడు
మనందరి నాయకుడు

రంగుమారిన రాజకీయాన్ని
హంగులు లేకుండా
అలుపెరుగని పోరాటంతో
మలుపును తిప్పిన మొనగాడు
ప్రజాగొంతుక తానై నిలిచి
విజయపథంలో పయనిస్తూ
అందరి మన్నానలు పొందిన
ప్రజనాయకుడు
ప్రశ్నించే గొంతును నొక్కిన వారిని ఖండిస్తూ
ప్రజాస్వామ్యాన్ని రక్షించిన ఘనుడు
అభినందనలు రేవంతు
వచ్చింది నీవంతు
ముఖ్యమంత్రిగా ప్రమాణ చేస్తున్న శుభ వేళా
ఆనందహేళ
జై తెలంగాణ.

జై జై తెలంగాణ
--------------------

కామెంట్‌లు