వెంకంపేట పాఠశాలకు తనిఖీ బృందం

 పాలకొండ నగర పంచాయతీ పరిధిలో గల వెంకంపేట వీధి పాఠశాలను తనిఖీ బృందం సందర్శించింది. పాలకొండ డివిజన్ ఉప విద్యాశాఖాధికారి పర్రి కృష్ణమూర్తి, మండల విద్యా శాఖాధికారి కురిటి సోంబాబు, 
ఇన్స్ పెక్షన్ బృంద సభ్యులు 
కుదమ తిరుమలరావు, సిద్ధాబత్తుల వెంకటరమణ, వాకముడి భారతి, మీసాల రామలక్ష్మి, గొర్లె రాంబాబు, చింతు బుచ్చన్నలు పాఠశాలను తనిఖీ చేసారు. 
ఉప విద్యాశాఖాధికారి పర్రి కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆంగ్ల భాషా మాధ్యమంలో విద్యాబోధన జరగాలని, టోఫెల్, లెర్న్ ఎ వర్డ్ ఎ డే, ఐ.ఎఫ్.పి. స్క్రీన్ ప్లే చేయడంలో మరింత కృషి చేయాలని అన్నారు.
మండల విద్యాశాఖాధికారి కురిటి సోంబాబు మాట్లాడుతూ పాఠశాల అసెంబ్లీలో విద్యార్థులంతా క్రమశిక్షణ, నిబంధనలు పాటించారని అన్నారు. పాఠశాలలో అమలగుచున్న నేషనల్ గ్రీన్ క్రాప్స్ ను పరిశీలించారు. ఎన్ జి సి విద్యార్థి నాయకులచే చేపట్టుచున్న మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణలను పరిశీలించి తగు సూచనలిచ్చారు. 
పాఠశాల రికార్డులను పరిశీలించి గణాంకాలను నమోదు చేసుకున్నామని మండల విద్యా శాఖాధికారి కురిటి సోంబాబు తెలిపారు. విద్యాశాఖ అమలు చేస్తున్న విద్యాపథకాలన్నీ ఏమేరకు అమలుచేస్తున్నారో పరిశీలించారు. 
వర్క్ బుక్స్, నోట్ బుక్స్ ను అన్ని తరగతులకూ వెళ్లి పరిశీలించారు. విద్యార్ధులతో చర్చించారు. 
ఉపాధ్యాయులు నమోదు చేస్తున్న దినచర్య పుస్తకాలు, పాఠ్యపథకరచనలు, బోధనా నమోదుపుస్తకాలు, తర్ల్ లిప్ మూల్యాంకన పుస్తకాలు, బోధనాభ్యసనా సామగ్రి, విద్యార్ధి ప్రగతి పత్రాలు, బోధనాభ్యసనా కృత్యపత్రాలను బృందసభ్యులంతా పరిశీలించారు. 
మధ్యాహ్న భోజన పథకం, మంచినీటి సౌకర్యం, వాష్ రూమ్స్, ఆటస్థలం, పూలమొక్కల పెంపకం, పాఠశాల ఆవరణలో పరిశుభ్రత, తరగతిగది అలంకరణ, సాంకేతిక పరిజ్ఞానమందించే ఐ.ఎఫ్.పి. వినియోగం, నాడు నేడు అమలు మున్నగునవి ఎలా అమలు జరుగుతున్నాయో పరిశీలించారు. 
పాఠశాల పనితీరుపట్ల సంతృప్తిని వ్యక్తంచేస్తూ తగు సూచనలిచ్చారు. 
పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.పరంకుశం నాయుడు, ఉపాధ్యాయులు బి.ఉదయబాబు, వి.నాగమణి, వై.మల్లేశ్వరరావు, డి.గౌతమి, సీ.హెచ్.కమలకుమారి, ఎస్.గోపి, జి.లక్ష్మీకుమారి, కె.రమాకుమారి పాల్గొన్నారు. 
హైదరాబాద్ హిందీ ప్రచార సభ నాగరిబోర్డ్ పరీక్షలందు ఉత్తీర్ణులైన బాలబాలికలకు ఉప విద్యాశాఖాధికారి పర్రి కృష్ణమూర్తి, మండల విద్యా శాఖాధికారి కురిటి సోంబాబు, ప్రధానోపాధ్యాయులు మండల హిందీ ప్రచారక్ గేదెల పరంకుశం నాయుడుల చేతులమీదుగా ప్రశంసాపత్రాలను బహూకరించడమైనది.
కామెంట్‌లు