"యుద్ధం - శాంతి;- కాజీపేట పురుషోత్తం,-విశ్రాంత ఆటవి అధికారి,-హన్మకొండ, తెలంగాణ.
నా భావనల కు అక్షర రూపం 🙏.
=========================
అఘాయిత్యాలు, అక్రమాలు, 
అన్యాయాలు చేసే అల్లరి మూకలు..!

అధికారాలు, అహంకారాలు, 
అమానవీయతలు చూపే పెద్దరికాలు..!

ఆధిపత్యాలు, ఆక్రమణలు, ఆగడాలు,
ఆక్రందనలు అనునిత్యం కరువైన 
మానవతా స్పందనలే నేటి సత్యం..!

రాజకీయ రణరంగపు రాచరికపు విన్యాసాలు
ప్రజా పాలన పేరిట ప్రజాస్వామ్య పరిహాసాలు..! 

ఒక వైపు గడుసు గద్దల, రాక్షస రాబందుల క్రూరత్వం
మరో వైపు శాంతి కపోతాల జాలి చూపుల అమాయకత్వం..! 

చూస్తుంటే ఇది తుఫాను ముందు ప్రశాంతత తంత్రం
రాబోయే యుద్దానికి ముందు శాంతియుత మంత్రం..!

ప్రశ్నించనిదే దొరకదు సమాధానం 
యుద్ధం జరపనిదే లభించదు శాంతి ప్రస్థానం..!

కామెంట్‌లు