సుప్రభాత కవిత;- బృంద

కనిపించని భావాల
వినిపించని మాటల
విదిలించిన చూపుల
కదిలించే మనసులు

మబ్బుల నిండిన 
నీటికి మల్లేనే
నీడలు కమ్మిన నిజాలు
మోసే ఎడదలు

చింతల వేడిని
చిత్రంగా మోస్తూ
చిత్తుగ తడిపే చినుకుల 
కోసం చిత్తం ఎదురుచూపులు

నిశ్శబ్దం  చీల్చే గాలులు
వేసే ఈలలు చెప్పే
కొత్త కబుర్ల కోసం
వేచిన కొమ్మల ఆకులు

అడ్డంకులెన్నొచ్చినా
ఆగదు అరుణోదయం
అతిగా కురిసే వానైనా
ఆగక తప్పదు ఎంతైనా!

అందరికీ  అనువుగ
అందరిలో ఒకరుగా
అందరమూ కలిసుంటే
అందలం మనదేగా!

కలవని తీరాల నడుమ
సాగే నీటికి ఇరుగట్లూ ఒకటే
కదిలే కాలచక్ర గమనానికి
ఉండవు తన పర తేడాలు

మంచికి  మన్నన ఇస్తే
ఎంచగ తప్పులు తోచవు
కొంచెం సర్దుకుపోతే
ఇల ఇరుకై తోచదు

ఉర్వికంతా ఉత్సాహం తెచ్చే
వేచిన వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు