సుప్రభాత కవిత ; -బృంద
తవ్వుకున్న తలపులను
తపనతో తడిమిచూసుకుంటూ
తరిమిన కాలాన్ని
తడిగుండెలతో తలచుకుంటూ

గుండె నిండిన బరువును
కంటి నిండుగ నింపుకుని
కానరాని రూపాలను
మనసుతో వెదుకుతూ

చెరపలేని చెమ్మలేవో
హృదయంలో ఊరుతుంటే
మరువలేని మమతలను
మనసారా తలచుకుని

చేరలేని సుదూరతీరాలకు
సాగిపోయిన బంధాలను
ఆగిపోయి చూచిన
అనుభవాల అలమటించి

కలత నిండిన మదిలో
కలల  దారిని వెదుకుతూ
కలవరంతో కదులుతూ
కరువైన కునుకుతో

కథగ మారిన గతములన్నీ
వ్యధను పెంచి వినిపించని
రోదనలై వెక్కుతూ
అలసిపోయిన మానసానికి

ఆర్తిగా తలనిమిరి
అనునయించి 
అలవాటుగా మరిపించి
అంతరంగానికి శాంతినిచ్చే

అరుదైన వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు