సుప్రభాత కవిత ; -బృంద
మది అడుగున దాచిన
మనసుకు నచ్చిన విషయం
మంచు మాటున దాగిన
మదికి వచ్చిన వసంతం

ఆశించినవన్నీ  అందక
అందనిది  దూరంగా ఊరిస్తూ
అందమైన ఆలోచనగా
అంతరంగంలో విరిసే కుసుమం

తలపులకే పరిమితమైన
పిలుపులు వింటూ
వలపులన్నీ వగపులై
తలుపు మూసిన హేమంతం

అన్వేషణ కై అడుగులు వేస్తూ
నిరీక్షించు మనసులకు
పరీక్షించు సమయం దాటి
అపేక్షలు అందే తరుణం

మంచు దుప్పటి కప్పుకుని
ముడుచుకున్న ప్రకృతికి
మమతలు పొంగ వెచ్చని
మయూఖ ధారల పాతం

రక్షించే రక్షకుని రక్షణకై
నిరీక్షిస్తూ.....

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు