లోక రక్షకుడు;- పోరంకి నాగరాజు
పంచాక్షరి పంచ పదులు 25-12-2023
=============================
క్రమ సంఖ్య:
11)
పరోప కారి 
లోక కాపరి 
లోకోపకారి
 రక్షణ కోరి 
అడుగిడెగా యేసయ్య!12)
రక్షకుడవు
పాలకుడవు
మా దేవుడవు
బాంధవుడవు 
నీవే ప్రభువు ఏసయ్యా!

13)
జ్ఞాన సంపన్నా
గుణ సంపన్నా
బల సంపన్నా
దయా సంపన్నా
కరుణా మూర్తి ఏసయ్యా!

14)
కరుణిస్తావు
ప్రేమ నిస్తావు
కృపనిస్తావు
సంరక్షిస్తావు
లోక రక్షకా ఏసయ్యా!

15)
మార్గాన్ని చూపి
పాపుల్ని ఆపి
పాపాల్ని బాపి
కరుణ నింపి
సన్మార్గం చూపు ఏసయ్యా!

16)
ఓ పాప హారి
రక్షణ కోరి
దరికి చేరి
దైవంగా మారి 
మమ్ము కాపాడు ఏసయ్యా!

కామెంట్‌లు