పాఠశాలకు సౌండ్ స్పీకర్ బహూకరణ

పాలకొండ హడ్కో కోలనీ ప్రాథమికోన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న జంప జయమణి, 
ఆ పాఠశాలకు ఇరవై వేల రూపాయల విలువైన పోర్టబుల్ సౌండ్ స్పీకర్ ను బహూకరించి తన ఔదార్యాన్ని చాటుకున్నారని ప్రధానోపాధ్యాయని ఎం.రామలక్ష్మి తెలిపారు. జయమణి తాను గతంలో పనిచేసిన అన్ని పాఠశాలల్లోనూ అవసరమగు ఫర్నిచర్ ను సమకూర్చారు. యూనిఫారం బట్టల విధానం రాక పూర్వం తానే విద్యార్థులందరికీ ఏకరూప దుస్తులను సొంత ఖర్చులతో అందజేయడం విశేషం. ప్రతిభగల విద్యార్థులకు జ్ఞాపికలు, పుస్తకాలు, ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థులకు నగదు పారితోషికాలు అందజేసి వారి ఉన్నతికి ఎంతగానో దోహదపడ్డారు. 
జయమణి ఔదార్యాన్ని పాలకొండ డివిజన్ ఉప విద్యాశాఖాధికారి పర్రి కృష్ణమూర్తి, మండల విద్యా శాఖాధికారి కురిటి సోంబాబు, పాఠశాల ఉపాధ్యాయులు ఎం.అరుణకుమారి, బి.రవికుమార్, పి.సుధారాణి, జి.రాంబాబు, మృత్యుంజయరావు, ఆర్.వి.రమణమ్మ, జె.చంద్రకళ, కె.దుర్గ, ప్రవీణ్, మల్లేశ్వరరావు అభినందించారు.
కామెంట్‌లు