సుప్రభాత కవిత - బృంద
స్వప్నాల నీడల వెంట
సుఖదుఃఖాల తోడు రాగా
జీవన పథంలో ఎదురయే
అనుభవాలే గురువులుగా

గమ్యం వైపు పరుగులు
సమయంతో రాజీలు
తీరికలేని పనులతో
తీసుకోని సెలవులతో

ఓటమినే  ఓడించే
ఓపికుంటే చాలట
అందరాని తీరాలూ
అందే తీరేనట

మనకు మనమే ధైర్యం 
మనసే మన సైన్యం.
మనతో మనకే యుధ్ధం 
చేరుకోవాలంటే లక్ష్యం

పడిలేచే కెరటం చెప్తుంది
ఓడినా పోరాటం ఆపొద్దని
చిగురించే మోడు చెప్తుంది
చివరి వరకూ ఆశ వీడకని

చోద్యం చూసే లోకానికి
నీ కష్టం  గురించి తెలియదు
తప్పులు వెదికే గొప్పలకు
ఎప్పుడూ  కొదవ ఉండదు

నొప్పింపక  నవ్విస్తూ
ముప్పులూ ముళ్ళూ
తప్పించి నడిపిస్తూ
చెప్పకనే  పాఠం చెప్పే

మరో మంచి ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు