చూద్దాం రండి! అచ్యుతుని రాజ్యశ్రీ

 మనం ఎంత సేపూ అజంతా ఎల్లోరా గుహలు గూర్చి చెప్తాం.కానీబాదామీ గుహల అద్భుతమైన శిల్ప కళ ను చెప్పం. వాటికి ప్రచారం లేదు.కర్ణాటక రాష్ట్రంలో ఉన్న చారిత్రక నగరం బాదామి.హుబ్లీకి దగ్గర గా ఉంది.అగస్త్య అనే మానవనిర్మిత జలాశయం ఉంది.రాతి మెట్లు పైనుంచి జలాశయం లోకి వెళ్లగలం. ఈ చెరువు చుట్టూ దర్శనీయ స్థలాలు చాలానే ఉన్నాయి.బాదామీ గుహలు ఇక్కడే ఉన్నాయి.కొన్ని మెట్లు ఎక్కితే నాల్గు గుహలు న్నాయి.మొదటిది శివుని ది.నటరాజుతాండవనృత్యం చేస్తూ కన్పించే విగ్రహం మొదటిది.రెండు మూడు గుహలు విష్ణు మూర్తి కి సంబంధించిన పురాణకథలశిల్పాలున్నాయి. నాల్గో గుహలో జైనమతం కి సంబంధించినవి.ఇంకా చెరువు చుట్టూ చిన్న చిన్న ఆలయాలు రాతితో కట్టబడ్డాయి. ఇవి 7
 వశతాబ్దికి చెందినవి.మ్యూజియం ఉంది. అగ్నిపర్వతం జ్వాల తో ఏర్పడిన కొండలు న్నాయి.బాదామీ పట్టణం చక్కగా కన్పడ్తుంది. హుబ్లీ నుంచి వెళ్ళటం సులభం.
ఇక రాజస్థాన్ లోని రాజప్రాసాదాలు చూడాలి అంటే రెండు కళ్ళు చాలవు.ఉమ్మేద్ భవన్ ప్యాలెస్ జోధ్పూర్ లో ఉంది.1929 లో రాజా ఉమ్మేద్ సింహ్ నిర్మించాడు.14 ఏళ్ళు పట్టింది.1943 లో పూర్తి ఐంది.30వేలమంది రోజు కూలీలు పనిచేశారు.పసుపు రంగు రాళ్ళు చలువరాయి బర్మా టేకు కలప తో అద్భుతంగా ఉంది.347 గదులు న్నాయి.3 విభాగాల్లో ఉంది ఈమహల్.మొదటి అంతస్తు రాజుల నివాసం.రెండోది మ్యూజియం.మూడోదిపాలెస్ హోటల్! ఇది హెరిటేజ్ హోటల్.ఇక్కడ ఉండవచ్చు. ఇక్కడి కి దగ్గరగా మెహ్రాన్ గఢ్ కోట. శీష్ మహల్ ఖెజ్ డలా ఖిలా‌షీష్ మహల్ ఉన్నాయి.చూశారా మనదేశం లో ఎన్ని గొప్ప కట్టడాలు ఉన్నాయో🌹
కామెంట్‌లు