కవనకబుర్లు- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ప్రచురిస్తే
అక్షరాలు కదలవు
పుటలు కదులుతాయి
పుస్తకాలు కదులుతాయి

పఠిస్తే
పదాలు కదలవు
పెదవులు కదులుతాయి
శబ్దతరంగాలు కదులుతాయి

చూస్తే
దృశ్యాలు కదలవు
కళ్ళు కదులుతాయి
చూపులు కదులుతాయి

సంతోషిస్తే
నవ్వులు కదలవు
బుగ్గలు కదులుతాయి
ముఖకవళికలు కదులుతాయి

తలిస్తే
తలలు కదలవు
భావాలు కదులుతాయి
మదులు కదులుతాయి

స్ఫృశిస్తే
ఆకారాలు కదలవు
అనుభూతులు కలుగుతాయి
అభిప్రాయాలు కలుగుతాయి

పాడితే
పాటలు కదలవు
స్వరాలు కదులుతాయి
రాగాలు కదులుతాయి

కవిత్వీకరిస్తే
విషయాలు కదలవు
ఆలోచనలు కదులుతాయి
అంతరంగాలు కదులుతాయి

కవులారా
కమ్మనికవితలు
వ్రాయండి
పాఠకులమదులు
తట్టండి

పాఠకులారా
కదలండి కదలండి
కవులవెంట కదలండి
కవితలను చదవండి
కవిత్వాన్ని ఆస్వాదించండి


కామెంట్‌లు