సుప్రభాత కవిత - బృంద
నడిచే గమనంలొ
కాలికి గాయం కాకూడ దనుకుంటే
దారంతా తివాచీ పరవలేం
అడుగులకు  మాత్రమే రక్షణ  నిస్తాం

తిమిరంతోఎడతెగని 
సమరం చేయలేకపొయినా
చిరుదీపం వెలిగిస్తాం
అడుగుముందుకేస్తాం

కిందపడ్డామని పరుగు ఆపం
లేచి దులుపుకుని
మళ్లీ  మొదలెడతాం
ప్రయత్నం  వదలం

వెంటాడి వేధించే
సమస్యను అలా వదిలేయం
అన్నిరకాలా ఆలోచన
చేస్తాం పరిష్కరించుకొంటాం

బ్రతకడం నేర్చుకుని
జన్మ తీసుకుంటామా??
వచ్చాక  కాలంతో
పాఠాలు నేర్చుకుని జీవిస్తాం

కొంచెం వివేకం కొంచెం స్వార్థం
మన్నించే సహనం
మరికొంచెం  సహకారం
కాసింత జాలి కొంత కరుణ

కలిస్తే కమ్మని బ్రతుకు
మనసొంతం...
కాదేదీ శాశ్వతం మనకు
కష్టాలైనా...సుఖాలైనా

జగమంతా నిండే వెలుగులో
మనమూ ఉన్నట్టు
అందరూ బాగుండాలని
అందరిలో మనముండాలనీ

కౌగిలించే కాంతిరేఖల 
వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు