తిరుప్పావై; కొప్పరపు తాయారు
   🌻17పాశురమ🌻
   అమ్బరమే,తజ్జీరే, శోణే అఱమ్ తెయ్యుమ్
   ఎమ్బెరుమాన్ !నన్దగోపాలా!ఎళిన్దరాయ్ 
   కొమ్మనార్కెల్లామ్ కొళున్దే !కుల విళక్కు 
   ఎమ్బెరుమాట్టి ! యశోదాయ్ ! అఱివురాయ్ !
   అమ్బరమూడరుతోణ్ణి యులగలనఉమ్బర్ 
   కోమానే !ఉరజ్జాదెళున్దిరాయ్  శామ్ 
   పోర్కళడిలా ! బలదేవా ! ఉమ్చియుమ్ 
   నీయు ముఱజ్ఞేలో  రెమ్బావాయ్ 
 ద్వారపాలకులు గోపాంగనలను, లోనికి అనుమతించగా వారి మొదట అన్న, వస్త్ర, తీర్థాలను, ధర్మబుద్ధితో దానము చేసే నందగోపులను '?స్వామి' మేలుకొనుమని ప్రార్థించారు .తర్వాత ప్రబ్బలి తీగ వంటి స్త్రీల కందరుకును తీగ వలె ముఖ్యమైన దానా! గొల్ల కులమునకు మంగళ దీపం వంటి దానా! మాకును స్వామిని వైనా ఓ యశోదమ్మ! లేమ్మా! అని వేడుకొనురి. ఆకాశం అంతా ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజు అయిన ఓ నిద్ర చాలునయ్యా! మేలుకో !అని ప్రార్థించిరి.
   ఆయన లేవకుండుట చూసి బలరాముని లేపక తప్పు చేసితిమి అని ఎరిగి మేలిమి బంగరు కడియములతో శోభించు పాద యుగళిని గల ఓ బలరామా! నీ తమ్ముడు శ్రీకృష్ణుడును, నీవును ఇంకను నిదురించుట తగదు కావున శీఘ్రమే లేచి రండు! అని అందరిని క్రమము తప్పక మేలుకొలుపుచున్నారు . వారి కృపనువేడుచంన్నారు కృష్ణా
🌻****🌻****🌻

కామెంట్‌లు