స్త్రీ కన్నీరు;- రచన: కీర్తిపట్నాయక్
కోట్ల కట్నం ఇచ్చి పెళ్లి పేరుతో భర్తను కొనుక్కుని కాటికి పోయే ఏకైక జీవి ఎవరైనా వున్నారా అంటే అది స్త్రీ అనే చెప్పాలి. 

మనసుకి పడిన సంకెళ్లు
ఎవరికి వినపడని వెక్కిళ్లు.
కట్నం ఇచ్చి శిక్షలు అనుభవించే జీవిత ఖైదీ స్త్రీ మాత్రమే...!!!

తాళి మెడలో పెడితే భర్త అనే బంధం తో కొత్త జీవితం ముడిపడుతుందని ఎన్నో ఊహలతో కొత్త అడుగు వేస్తూ తన భర్త చేయి పట్టుకొని ముందుకు నడుస్తారు చాలా మంది స్త్రీలు కాని ఆ అడుగు , ఆ మూడు ముళ్లు జీవితానికి సరిపడా శిక్ష అని తెలుసుకొనే లోపునే జీవితం ఆగిపోతుంది.

అలాంటి స్త్రీ మూర్తులు బాధను చూసి మేం అధికారులం, మేం రాజకీయ నాయకులం మీ కష్టాలు తీర్చడానికే అమ్మ గర్భం లో నుండి ధరణి మీదకు వచ్చిన ధీరులం, వీరులం అంటూ డబ్బాలు కొడుతూ వుంటారు మైకులలో.  

స్త్రీ మూర్తికి కష్టం రాగానే స్పర్శ లేని బొమ్మలుగా వుండే మహానుభావులు, స్పర్శ కోల్పోవడం కాకుండా సమాజానికి, భావితరాలకు కూడా స్పర్శ లేకుండా చేస్తున్నారు.

 భయంకరమైన అత్తింటి వేదింపులు, వరకట్నం రాక్షస కోరల రాచిరంపాన, మహిళా మేలుకో, నీ హక్కులు తెలుసుకో, నీ చట్టాలు తెలుసుకో అని గళాలు గర్జిస్తున్న, అవి గర్జనలు గానే మిగులుతుంది చాలా సందర్భాల్లో

స్త్రీ ఓర్పు చాలా గొప్పది.
ఆ ఓర్పు , నశిస్తే ప్రళయమే సంభవిస్తుంది. అంత శక్తివంతమైనది స్త్రీ.

ప్రళయం సంభవించకా ఎంత నష్టం వాటిల్లింది అంటూ సర్వే చేసి లెక్కలు కట్టడం కాదు, ఆ ప్రళయం సంభవించకుండా ఆపాలి. 
ఆ ప్రళయానికి కారణమైనవారు ఎంత పెద్ద, గొప్ప వారు అయిన క్షమించకుండా శిక్ష పడాలి.

స్త్రీ ఏడుపు మంచిది కాదు. నీ ఎదురుగా గుండె ఎగసిపడేలా, ఆమె కన్నీటి  కెరటాలకి ఆకాశం, భూమి  బ్రద్దలు అయ్యేలా ఏడుస్తున్నా, నాదేమి వుందిలే నాకు సంబంధం లేని కథ అనుకుంటే అది తప్పే అవుతుంది. 

ఎంతో కొంత నీకు తోచిన మాట సాయం చేయు. నిస్సహాయ స్థితిలో ఉన్న స్త్రీలను ఆదుకుందాము.


కామెంట్‌లు