శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది );- ఎం. వి. ఉమాదేవి
 7) భావః
అన్నిటికి ఉనికియైనట్టివాడు
సర్వవిభూతులు కల్గినవాడు
భూతప్రపంచమున వ్యాపించినాడు
తనసృష్టితో సర్వ వ్యాపకుడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
8)భూతాత్మా-
సర్వభూతముల ఆత్మయైయుండును
జీవకోటి అంతర్యామి యగును
సర్వప్రాణి హృదయంలో నుండును 
శరీరమనుగడకు సాక్షియగును
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
9)
భూతభావనః
సృష్టి నైపుణ్యము కల్గియున్నాడు
దివ్యపోషణము చేయుచున్నాడు
కన్నవారివలే జన్మనిచ్చాడు
జగత్పితగా పోషణనిచ్చాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
10)
పూతాత్మా -
కర్మఫలదోషమంటని వాడు
పవిత్రస్వరూపం గలిగినవాడు
సృష్టికి, వృద్ధికీ కారణభూతుడు
జీవగుణ సంబంధ రహితుడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

కామెంట్‌లు