* కోరాడ నానీలు *

 కంటికి రెప్పలా
    కాచి, పెంచారు
   అనాధలై,ఆశ్రమాల్లో... 
     బిడ్డలకు భార0 !! 
     *****
పెళ్ళి కాలేదు
   తల్లి అయి0ది
     కన్నబిడ్డ  అనాధయై
         పెంట కుప్పమీద! 
       ******
నీతు- లెన్నయి నా
    చెప్పవచ్చ...! 
  ఆచరి0చిన...వారే
    ఆదర్శ వంతులు !! 
     ******
విదురునివి
   వెయ్యి నీతులు! 
    ఒక్క సత్య వాక్ పాలన
     హరి శ్చ0ద్ర  ఖ్యాతి ! 
    *******
సిబి   -  బలి లు
   ఇప్పుడు లేరు! 
   చరిత్రలో  చిరస్తాయిగ    
      ఉన్నారు- ఉంటారు !! 
       *******
కామెంట్‌లు