పంచపది బసవ పురాణం;- కాటేగారు పాండురంగ విఠల్- పంచపది ప్రక్రియ రూపకర్త-హైదరాబాద్ 9440530763
 11
తుదకు మహాశివుడు ప్రత్యక్షమయ్యెను
శివుణ్ణి చూసి శిలాదుడు సంతోషించెను
ఆయనతో పుత్ర సంతానమివ్వమనెను
అతనిలో శివ భక్తి వుండాలని చెప్పెను
భక్తిలేనిచో శిలాదుడు చంపేస్తాననె విఠల!
12
శివుడు శిలాదుని కోరిక మన్నించెను
ఒకసారి నందీశ్వరుని వంక చూసెను
శిలాదుని కుమారునిగా పుట్టమనెను
నా ప్రతిరూపుగా ఖ్యాతిగాంచాలనెను
నందీశుడు అయోనిజుడై జన్మించెను విఠల!
13
భక్తి అనే క్షీరాన్ని గ్రోలి పెరుగుతున్నాడు
గురుపాద ధ్యానమునందు మునిగాడు
వేదవేదాంతాలన్నియూ అభ్యసించాడు
నందికేశుడు ఘోర తపస్సాచరించాడు
బ్రహ్మాండం గజగజ వణికిపోయెను విఠల!
14
దేవతలందరు శివుని చెంతకొచ్చారు
ముక్తకంఠంతో పరిస్థితిని వివరించారు
ఓ పరమేశా! కాపాడని వేడుకున్నారు
వారు శివునితో నంది చెంతకు వెళ్లారు
శివుడు దేవతలకభయమునిచ్చెను విఠల!
15
అతడు బ్రహ్మ పదవిని కోరడని
విష్ణు పదమసలభిలషించడని
దేవేంద్రుని పదవినీ కోరుకోడని
అతనికి ఇతర కోరికలేవీ లేవని
శివుడు దేవతలకు వివరించెను విఠల!
16
దేవతలందరితో కలిసి వెళ్లెను
వారితో శ్రీపర్వతంను చేరుకునెను
నందికేశుడు తన కళ్ళు తెరిచెను
శివుడు వరం కోరుకొమ్మని అనెను
శివా!నీ దర్శనం చాలనె నందికేశుడు విఠల!
17
శివుడు ఆలింగనము చేసుకునెను
వాహనము చేసుకుంటానని చెప్పెను
ప్రమథగణాధిపతిగా పట్టము కట్టెను
నందికేశునికి సర్వజ్ఞత ప్రసాదించెను
దేవతలతనికి నమస్కరించిరి విఠల!
18
నందికేశు తపమాచరించిన స్థలము
అది పిలువబడెను నంది మండలము
ఇచ్చటి కొచ్చిన సమస్త జీవ జాలము
ఈ జన్మమునందే పొందెదరు మోక్షము
వాక్సుద్ధి బుద్ధి భక్తి పొందెదరనెను విఠల!
19
నిరంతరభక్తి నిరహంకార,సదాచారము
దివ్య ఆత్మ తత్త్వము విశుద్ధ చరిత్రము
మహాపాండిత్యము సత్యం సౌకుమార్యము
నందికేశ గుణాలు సర్వ మంగళకరము
అని పార్వతేదేవి శివునితో చెప్పెను విఠల!
20
నందికేశుని చరిత నారదునికి చెప్పెను
శివుని మాటలతో మహర్షి పులకించెను
నందికేశుడానంద భాష్పాలను రాల్చెను
చేతులు జోడించి శివుణ్ణి కొనియాడెను
శివుడు ప్రేమతో ఇలా చెప్పసాగెను విఠల!


కామెంట్‌లు