కైకేయి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 మొదటి ప్రమాదం రాజమందిరంలోని వ్యతిరేకతతో వెలుపల నుంచి ప్రజల నుంచి రానున్న వ్యతిరేకతతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం కైకేయి దు ష్ట నిర్ణయానికి రాజమందిరంలోని సకల జనాలు కోపంతో రగిలిపోతున్నారు  విలపిస్తున్నారు. రాముని వన గమనాన్ని అందరూ నిరోదిం చాలనే తీవ్ర ప్రయత్నంలో ఉన్నారు. అంతఃపురం రాణులు సుమారు 350 మంది వారి వారి భవనాల్లోంచి బయటికి వచ్చారు  దశరధుడు రాముని తో రామా నేను కైకేయి ముందు ఆసక్తుడైనను ఇటువంటి బలహీనుని ఆదేశాలను పాటించడం వల్ల ప్రజా శ్రేయస్సు అనకూడదు అని అంటారు అందరినీ బయటికి వచ్చి తన మాటను సమర్పించమని కొరతాడు శ్రీరాముని ఒక్కరోజు వనగమనాన్ని ఆలస్యం చేయమని దశరథుడు కోరుతాడు కానీ ఈ మాటలే ఇవి కూడా శ్రీరాముని మనసును మార్చలేకపోయాయి.
కైకేయి రాతి గుండె కరగనూ లేదు ఏ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయం పై సాహసం ధృఢ సంకల్పం ఉండడం అత్యవసరం కైకేయి ఈ అద్భుత స్థిర సంకల్పంతో నిలబడి విజయం సాధించింది జానకి వనవాసయోగ్యమైన దుస్తులు తరించడంలో అసక్తురాలు అయినప్పుడు శ్రీరాముడు ఆమెకు సహకరించి చూపాడు వశిష్ట మహర్షి అంతా గమనించిన వాడై అత్యంత కఠిన పదజాలంతో కైకేయికి  మంచి చెడులను గురించి విశ్లేషించి చెప్పాడు సుమంతుడు కూడా అదే రీతిలోనే కైకేయి పట్ల కట్టుగా మాట్లాడి విశ్వాస ఘాతకురాలుగా క్రోరవనితగా నిలదీశాడు. దాదాపు పూరజనులందరూ కైకేయిని దుర్భాషలాడారు అయోధ్య యావత్తు కైకేయిని రాజ్యాన్ని వీడి రాముని అడుగుజాడల్లో పైనుంచి సిద్దమైనారు దశరథుడు ఆనాటి నుంచి కైకేయి ముఖం చూడగలచలేదు తన శేష జీవితాన్ని దుఃఖితురాలైన కౌశల్యతో గడపాలని నిర్ణయించుకున్నాడు  దశరథ మహారాజు. తుదకు ఆయన జీవితం రాముని ప్రేమలో విలీనం అయిపోతుంది. దశరధుని మరణం కూడా కైకేయి ఏ ప్రభావం చూపలేదు తన పుత్రుడు భరతుడు రాజ సింహాసనం పై ఆసీనుడు అవ్వాలని కాంక్ష తప్ప ఆమెకు మరేమీ పట్టలేదు ఆ శుభ ఘడియ కొరకే ఆమె నిరీక్షించింది భరతుడు తనను అభినందిస్తాడని ఆశా కిరణమే ఆమెలో మిగిలింది కానీ ఆ ఆశ కిరణం చిన్న కిరణం అయిపోయింది తండ్రి మరణ వార్త రాముని వనవాసం తల్లి దుష్ప్రవర్తన  భరతుని  మనస్సును కకావికరం చేశాయి భరతుడు తన తల్లిపై క్రోధాగ్నితో విజృంభించాడు శత్రుగునుడైతే మందరను చితకబాదాడు  ఇప్పుడు కైకేయి మిగిలింది శూన్యం అధికార వ్యామోహం నశించింది కానీ ఆమె తన జీవితం ద్వారా లోకానికి తెలియచెప్పండి ఏమిటంటే  ఏ వ్యక్తి అయినా ఉద్దాన పతనాలకు తన ప్రవర్తనే  కారణభూతమవుతుందని సత్యాన్ని రుజువు చేసింది వాల్మీకి కైకయికి మహా కాంతి అను  సంజ్ఞను ప్రసాదించాడు.

కామెంట్‌లు