సుమిత్ర;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.


 ఎప్పుడూ ఆటంకపరచడానికి ప్రయత్నించనేలేదు ఉన్నత ధర్మాచరణలో తన సర్వ సౌఖ్యాలను త్యాగం చేసింది  ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో మానసిక స్థిరత్వం ఉండడానికి ఆమెలోని ఉన్నత సంస్కారము హృదయ వైశాల్యమే మూల కారణం వేధించిన సమయంలో కానీ కైకేయి గూర్చి కార్యనిర్వహణలో అనుసరించిన వివిధ వికృత చేష్టల పర్యవసాన సమయంలో కానీ సుమిత్ర స్థిరంగా నిబ్బరంగా నిలిచి అందరికీ ఓదార్పు చేకూరుస్తూ ఉండడం ఆమె వ్యక్తిత్వానికి ప్రతీకగా భావించాలి లక్ష్మణుడు సెలవు తీసుకునే సమయంలో మాత్రమే సుమిత్ర నోరు తెరిచి మాట్లాడింది అంతకు ముందు ఆమెకు మాట్లాడడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కానీ మాట్లాడలేదు రాముని వనవాస వార్త కౌసల్యకు భాదించిన సమయంలో సుమిత్ర కౌశల్యతో పాటే ఉంది కానీ అభినందించడం ప్రశంసించడం  చేయలేదు. ఆనందాన్ని అంతా హృదయంలోనే దాచుకుంది. కౌశల్య సంతోషాన్ని గమనిస్తూ అంతరంగంలో సంతోషిస్తుంది కారణం ఈ నిర్ణయంతో ఎంతో సత్య ధర్మస్థాపనకు బీజం పడిపోయిందని భావించింది రాముడు లక్ష్మణునితో నీకోసం ఈ రాజ్యాన్ని స్వీకరిస్తానని చెప్పినప్పుడు కూడా సుమిత్ర మౌనంగానే ఉంది ఈ మౌనమే ఆమె సహజ సిద్ధ సాత్వికతను అపార సౌజన్యానికి అద్దం పడతాయి ఎప్పుడు కూడా సుమిత్ర కౌసల్యతో ఉంటూ ఆమెకు ఎలాంటి పరిస్థితులైన స్వంతన వచనాలతో ఓదారుస్తూ ప్రేమతో మాట్లాడుతూ ఉండేది అంతేకాదు కౌసల్యకు గలిగిన కష్టసుఖాలలో సుమిత్ర పాలుపంచుకునేది కూడా సుమిత్ర రామ పట్టాభిషేక వార్త విని ఉప్పొంగిపోలేదు అలాగే వనవాస వార్త విని దుఃఖాన్ని ప్రదర్శించకూడదు మౌనమే ఆమె సర్వసరంగా ఉండేది. కానీ కౌసల్యతో రాముడు తన వనవాస వార్తను సంకోచిస్తూ కొద్దికొద్దిగా చెప్పుతున్న సమయంలో కౌసల్య కోపోద్రిక్తురాలు అయింది ఆ సమయంలో సుమిత్ర కూడా ఆమె చెంతనే ఉన్నది కానీ సుమిత్ర ఆ సంకట స్థితిలో కూడా స్థిరంగానే ఉండి రామలక్ష్మణులను వారించి వారిని వనవాసం వీడి రాజ్యంలోనే ఉండమని సలహా ఇచ్చిందే తప్ప ఉద్వేగాలకు లోను కాలేదు తల్లి ప్రేమ అపారంగా ఉన్నా కూడా సుమిత్రకు ఈ పరివర్తన పట్ల ఆశ్చర్యం కలగలేదు ఆ మాతృ హృదయంతో రామలక్ష్మణులు ఇద్దరు సమానంగా ప్రతిష్ఠుడై ఉన్నారు మొదట రాముడే తర్వాత లక్ష్మణుడు ఆమె సంపూర్ణత మాతృభావం అలా ఉపేకం ఈ ఆకస్మిక పరిణామానికి దైవ నిర్ణయమే కారణమని ఆమె ఆలోచన  నమ్మకం.


కామెంట్‌లు